ఈ వివరాలను పరిశీలిస్తే, ఘజియాబాద్‌కు చెందిన సందీప్ మిశ్రా అనే వ్యక్తి ఓ కంపెనీలో మెషీన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఇదే కంపెనీలో ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి సీనియర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే, సందీప్ పనితీరుపై ప్రమోద్ కుమార్ కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీన్ని సందీప్ జీర్ణించుకోక ప్రదీప్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ప్రదీప్‌ను భౌతికంగా లేకుండా చేయాలని ప్లాన్ చేసిన సందీప్.. మందు పార్టీ పేరుతో తన ఇంటికి పిలిపించాడు.
ప్రదీప్ కుమార్ ఇల్లు సందీప్ ఇల్లు కేవలం 300 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. తన భర్త రాత్రికి ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు ఉదయం సందీప్ ఇంటికి ప్రదీప్ భార్య వెళ్లి చూడగా, రక్తపు మడుగులో తన భర్త పడివుండాన్ని చూసి బోరున విలపించసాగింది.
ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చిన తలలేని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోని చెత్త కుండీల్లో గాలించగా, ప్రదీప్ కుమార్ తల లభ్యమైంది. అలాగే, హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.