తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. ముంబై, భందూప్‌కు చెందిన 19 ఏళ్ల కాజల్ షిండే సమ్మర్ సెలవుల్లో ఏదైనా ఉద్యోగం చేయాలని భావించింది. అందులోభాగంగా తన సోదరితో కలిసి ఓ సంస్థలో టెలికాలర్‌గా చేరింది. హెచ్ఎస్‌సీ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ చదువు కొనసాగించాలని నిర్ణయించుకుంది. దీంతో ఉద్యోగం మానేస్తున్నట్టు టీమ్ లీడర్ అంకిత్ గైక్వాడ్ (23)కు చెప్పి జూన్ నుంచి ఉద్యోగం మానేసింది.
అయితే, తనకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వాలని అడగ్గా.. 15 రోజుల తర్వాత రమ్మని చెప్పాడు. గడువు ముగిసిన తర్వాత జీతం కోసం వెళ్లగా మరో రెండు రోజులు సమయం కావాలని అంకిత్ అడిగాడు. ఆ తర్వాత జూలై 26న ఇస్తానన్నాడు. ఈ క్రమంలో కాజల్‌కు ఫోన్ చేసిన అగర్వాల్ జీతం తీసుకునేందుకు భందూప్‌లోని డ్రీమ్స్ మాల్ వద్దకు రావాల్సిందిగా కోరాడు.
అక్కడికి వెళ్లి అతడికి ఫోన్ చేయగా మాల్ పై ఫ్లోర్‌కి రమ్మన్నాడు. అక్కడికి వెళ్లిన కాజల్ ముఖంపై కత్తితో దాడిచేశాడు. మెడను కోశాడు. తీవ్ర గాయాల పాలైన యువతిని వెంటనే ముంబైలోని ఎంటీ అగర్వాల్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.