తమంతట తాము ఎవరిపైనా ముందస్తుగా అణ్వస్త్రాలు ప్రయోగించబోమంటూ ఇన్నాళ్లూ భారత్ చెబుతూ వస్తోంది. దీనిపై మనోహర్ పారీకర్ స్పందిస్తూ... అసలు మనం ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలంటూ ప్రశ్నించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని... ప్రభుత్వ అభిప్రాయం కాదన్నారు.
మరోవైపు, తాను చేసిన వ్యాఖ్యలపై ప్రచారం ఎలా జరుగుతుందో కూడా పారీకర్ నవ్వుతూ చెప్పారు. భారతదేశం తన అణువిధానాన్ని మార్చుకుందని మీడియాలో వార్తలు వస్తాయన్నారు. అవసరమైతే భారత్‌పై అణుదాడి చేస్తామంటూ పాకిస్థాన్ బెదిరించేదని... మనం సర్జికల్ దాడులు జరిపిన తర్వాత పాక్ చాలా సైలెంట్ అయిపోయిందని మంత్రి గుర్తుచేశారు.