కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

దేవీ

బుధవారం, 30 ఏప్రియల్ 2025 (19:51 IST)
Vijay Deverakonda, Bhagyashree
కింగ్‌డమ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హృదయం లోపాల ప్రోమో ఇప్పుడు విడుదలైంది. పూర్తి సాంగ్‌ను మే 2న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రోమోలో విజయ్  దేవరకొండ, భాగ్యశ్రీల రొమాన్స్ సముద్రం ఒడ్డున లిప్ కిస్ లతోనే ఎక్కువగా వుంది. ఆ తర్వాత సాంగ్ పాడుతూ బైక్ పై వెళుతున్న సీన్ కూడా చూపించారు. పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా ఈ పాట రాబోతున్నట్లు ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో రెచ్చిపోబోతున్నట్లు ఈ ప్రోమోలో హింట్ ఇచ్చారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మే 30న ‘కింగ్డమ్’ను గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
 
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ బాణీలు సమకూర్చారు. జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC నిర్వహించిన సినిమాటోగ్రఫీ ఆకర్షణీయంగా వున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మెలోడీకి కెకె సాహిత్యం రాశారు. దార్ గై కొరియోగ్రఫీ నిర్వహించారు. నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు