రైలులో భారీ దొంగతనం.. మూడున్నర కేజీల బంగారు నగల్ని ఎత్తుకెళ్లారు..

సెల్వి

ఆదివారం, 29 సెప్టెంబరు 2024 (10:29 IST)
రైలులో భారీ దొంగతనం జరిగింది. కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏసీ కోచ్‌లో మూడున్నర కేజీల బంగారు నగలను దొంగలు దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.2.5 కోట్లు అని బాధితులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన నగల వ్యాపారులు కాశీ విశ్వనాథ్, రంగారావులకు చెందిన ఈ బంగారం కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాకయ్యారు. 
 
కాగా బాధితులు కాశీ విశ్వనాథ్, రంగారావు ఇద్దరు అన్నదమ్ముళ్లు. వీరిద్దరూ సత్తెనపల్లిలో ‘సాయిచరణ్‌ జ్యువెలర్స్‌’ పేరుతో నగల వ్యాపారం చేస్తున్నారు. నగలను తయారు చేసి కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో అమ్ముతుంటారు. నగలు విక్రయించేందుకు ఇటీవలే బళ్లారి వెళ్లిన వీరిద్దరూ శుక్రవారం రాత్రి హుబ్బళ్లి-విజయవాడ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో తిరుగు పయనమయ్యారు. 
 
రంగారావు తన తల కింద నగల బ్యాగును పెట్టుకొని నిద్రపోయారు. మెలకువ వచ్చాక చూసుకోగా బ్యాగు కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. దొంగతనానికి గురయిందని గుర్తించారు. దీంతో ఫిర్యాదు చేసేందుకు రెండు మూడు స్టేషన్లు దిగారు. కానీ గంటలు గడిచాయే తప్ప పోలీసులు కాలాయాపన చేస్తూ.. కేసు నమోదు చేయలేగు. 
 
చివరికు దొంగతనం జరిగిన ప్రాంతం నంద్యాల రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని చెప్పి అక్కడి నుంచి పంపించారు. నంద్యాల చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు సమయం రాత్రి అయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు