నిర్భయ రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదు.. రాష్ట్రపతి

శుక్రవారం, 6 డిశెంబరు 2019 (15:31 IST)
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంచలన ప్రకటన చేశారు. నిర్భయ కేసులో రేపిస్టులకు క్షమాభిక్ష అవసరం లేదంటూ వారి క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. 
 
హైదరాబాద్‌లో దిశ కేసు నిందితులైన నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి హతమార్చిన రోజే రాష్ట్రపతి.. నిర్భయ కేసు దోషులైన క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించడం గమనార్హం. మైనర్లపై లైంగిక దాడులను అరికట్టడానికి ఉద్దేశించిన పోక్సో చట్టం గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
 
కాగా 2012లో ఢిల్లీలో నిర్భయపై జరిగిన అత్యాచార కేసులో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 
 
కాగా.. ఈ దోషి మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్ఛుతూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఇందుకు సంబంధించిన ఫైలును కేంద్ర హోం శాఖకు పంపారు. పోక్సో చట్టం కింద దోషులుగా తేలినవారు క్షమాభిక్షకు అర్హులు కారని, పార్లమెంటు ఈ విధమైన పిటిషన్లను సమీక్షించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు