రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

డీవీ

గురువారం, 2 జనవరి 2025 (18:19 IST)
Shankar, Rajmouli, charan
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఆవిష్కరణ సాదాసీదాగా జరిగింది. గురువారంనాడు హైదరాబాద్ లోని ఎ.ఎం.బి. మాల్ లో రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పోలీసుల నిబంధనల ప్రకారం చాలా సింపుల్ గా జరిగింది. ముందుగా పరిమితమైన పాస్ లను జారీచేశారు చిత్ర యూనిట్. పోలీసులు బందోబస్తు నడుమ ఈ వేడుక జరిగింది.
 
ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడుతూ, శంకర్ గారంటే అందరికీ గౌరవమే. తను తెలుగువాడే అని లెక్క. గత 10 ఏళ్ళలో పెద్ద సినిమాలు వందల కోట్ల సినిమాలు తీస్తున్నాం. చాలా మందికి గర్వంగా ఫీలవుతుంటారు. కానీ మేము గొప్పగా ఫీలయ్యేది శంకర్ గారి వల్లే. మనకున్న కలలను పెద్ద తెరపై తీయగలం అని నమ్మకాన్ని శంకర్ గారు మాలాంటివారికి పునాది వేశారు. 
 
గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంఛ్ చేసే అవకాశం ఇచ్చారు. ఒకే ఒక్కడు నా ఫేవరేట్. కాళ్లు లేని అబ్బాయి అర్జున్ దగ్గరకు వచ్చి ’దేశం నాలాగే వుందంటూ.. చెప్పే డైలాగ్ నాకు కళ్ళు చెమ్మగిల్లుతాయి. మగధీర చరణ్ కూ ఆర్.ఆర్.ఆర్. లో చరణ్ చాలా ఎత్తు ఎదిగాడు. మగధీరలో నేను చరణ్ ను హీరో అని పిలిచేవాడిని. ట్రైలర్ లో హెలికాప్టర్ నుంచి కత్తిపట్టుకుని దిగుతున్న షాట్ అద్భుతంగా వుంది. మరో షాట్ లో గన్ పట్టుకుని చిన్నపిల్లాడిలా ఏడిపించే సీన్. అలాగే డాన్స్ కూడా అద్భుతం. అలాగే గుర్రం షాట్ ను చేసేటప్పుడు నా పర్మిషన్ తీసుకో చరణ్. ఎందుకంటే అది నా రైట్స్ అంటూ చలోక్కి విసిరారు.
 
చిత్ర దర్శకుడు శంకర్ మాట్లాడుతూ, మనం హీలీవుడ్ సినిమాను చూస్తాం. ఇప్పుడు హాలీవుడ్ సినిమానే తెలుగు సినిమావైపే చూసేలా రాజమౌళిగారు గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా వుంది.  కార్తీక్ సుబ్బరాజు అనే దర్శకుడి దగ్గర కథ తీసుకుని గేమ్ ఛేంజర్ సినిమా చేశా. తెలుగు సినిమాల్లో నాకు ఒక్కడు, పోకిరి సినిమాలు ఇష్టం. ఇలాంటి సినిమా చేయాలనుకునేవాడిని. గేమ్ ఛేంజర్ సినిమాకూడా అలాగే వుంటుంది. ప్రభుత్వ ఆఫీసర్ కూ, పొలిటీషయన్ కూ మధ్య జరిగే వార్. హీరో కు బ్యాక్ స్టోరీ వుంటుంది. అది ఎలా కథకు ఇంపాక్ట్ ఇస్తుందనేది ముఖ్యాంశం. మైన్ పాత్ర చరణ్ బాగా చేశాడు. ఆఫీసర్ గా రామ్ చరణ్ పాత్రే కనిపిస్తుంది. ఇది సంక్రాంతి కాదు రామనవమి అనుకోవచ్చు. గెడ్డెంతో మరో పాత్ర చేశారు. ఆయన్నుచూడడానికే ప్రేక్షకులు వస్తారు. పంచె కట్టుతో సోల్ ఆఫ్ ది మూవీ. కియారా అద్వానీ అందమేకాదు. నటన కనబరిచారు. డాన్స్ లో పోటీగా చేశారు. దిల్ రాజు గారు సినిమాకు ఏది కావాలన్నా వెంటనే ఎరేంజ్ చేశారు. శిరీష్ ఆయనకు సహకరిస్తూ సినిమాను ముందుకు తీసుకువచ్చారు. అని తెలిపారు.
 
గేమ్ ఛేంజర్.. సినిమా సంక్రాంతికి శంకర్ సినిమాగా పేరు తెచ్చకుంటుంది. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ తెలిపారు.
నటి అంజలి మాట్లాడుతూ, నాకు మంచి పాత్ర ఇచ్చి దర్శకుడు ప్రోత్సహించారు. రామ్ చరణ్ తో నటించడం చాలా హ్యాపీగా వుంది.
 
శ్రీకాంత్ మాట్లాడుతూ, 4వ తారీఖు వరకు కొన్ని మాటలు అట్టిపెట్టుకోమని దిల్ రాజు చెప్పారు. నేను ఇంతకుముందే చెప్పినట్లు గేమ్ ఛేంజర్ లో నా నాన్న గుర్తుకు వచ్చారు. మా నాన్నగారి పాత్ర పోషించాను. మా అమ్మగారు కూడా సినిమా చూడాలని ఉత్సాహపడుతున్నారని అన్నారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ, తమిళ సినిమాను పాన్ ఇండియా సినిమాగా శంకర్ తీసుకెళ్ళారు. తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి రాజమౌళి తీసుకువచ్చారు. వీరిద్దరూ కలిసి ఈ వేడుకలో పాల్గొడం చాలా ఆనందంగా వుంది. ఇప్పటివరకు బయటకు వచ్చిన అంశాలు చాలా కొద్దిశాతమే. 10వ తేదీన అన్ని విషయాలు శంకర్ థియేటర్ లో చూపిస్తారు. అంతవరకు ఉత్సుకతో వున్నాము అని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు