తాజాగా నీట్-2023 యూజీ నోటిఫికేషన్ విడుదలైంది. మే 7వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 06,2023గా నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది.
ఎగ్జామ్‌లో మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలో మూడు సెక్షన్స్ ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది.