పబ్జీ వ్యసనంలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హింగోలిలోని ఖట్‌కలి బైపాస్ సమీపంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, నగేశ్ గోరి(24), స్వప్నిల్ అన్నపూర్ణె (22) అనే యువకులు హింగోలికి సమీపంలో ఉన్న రైలు పట్టాల వద్ద పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారు. గేమ్ మాయలో పడి చుట్టు ప్రక్కల జరుగుతున్నవి గమనించలేదు.
ఇటీవల కాలంలో బాగా ప్రాచూర్యం పొందిన పబ్జీ గేమ్ వల్ల అనేక మంది పిల్లల ప్రవర్తన మారిపోతోందని, చివరికి ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయని, దానిని వెంటనే నిషేధించాలని కొంత మంది తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.