భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్లలో ఆప్ఘనిస్థాన్ ఒకటి. మైదానంలో తమ ఆట తీరుతో కోట్లాది మంది క్రికెట్ అభిమానులను సొంతం చేసుకుంది. అంతేనా.. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లను చిత్తు చేసి సంచలనం సృష్టించింది. అలాంటి జట్టు కెప్టెన్‌గా రహ్మనుల్లా గుర్బాజ్. ఈ టోర్నీ నుంచి స్వదేశానికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఆయన.. అహ్మదాబాద్‌లో తన పెద్ద మనసును చాటుకున్నారు.