కాన్వాయ్ ఆపి బాలికను ఆశీర్వదించిన ప్రధాని మోడీ

మంగళవారం, 31 మే 2022 (16:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో అరుదైన, ఆసక్తికర దృశ్యం కనిపించింది. తన కాన్వాయ్ ఆపి ఓ బాలికను ఆశీర్వదించారు. అదే సమయంలో ఆ బాలిక వేసిన తన తల్లి పెయింటింగ్‌ను ప్రధాని మోడీ తీసుకున్నారు. 
 
ప్రధాని మోడీ మోడీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా పర్యటనకు వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. 
 
రోడ్డుకు ఇరువైపులా నిల‌బ‌డిన జ‌నానికి అభివాదం చేస్తూ స్పీడుగా సాగుతున్న మోడీ... ఓ చోట ఉన్న‌ట్టుండి త‌న కాన్వాయ్‌ను ఆపారు. ఆ త‌ర్వాత కారులో నుంచి దిగిన మోడీ.. ఆ జ‌న స‌మూహంలో బారీకేడ్ల‌కు ఆవ‌ల నిలుచున్న ఓ బాలిక వ‌ద్ద‌కు వెళ్లారు. 
 
ఆ బాలిక చేతిలోని పెయింటింగ్‌ను తీసుకున్నారు. బారీకేడ్ల‌కు ఆవ‌లే నిలుచుండి మ‌రీ మోడీ కాళ్ల‌కు ఆ బాలిక న‌మ‌స్క‌రిస్తే... మోడీ ఆ బాలిక‌ను ఆశీర్వ‌దించారు. 
 
ఇంత‌కీ ఆ బాలిక గీసిన పెయింటింగ్ ఎవ‌రిదో తెలుసా? మోడీ మాతృమూర్తిది. కాన్వాయ్‌లో స్పీడుగా వెళుతున్న మోదీ... త‌న త‌ల్లి పెయింటింగ్ చూడ‌గానే త‌న కాన్వాయ్‌ని నిలిపేయ‌డం గ‌మ‌నార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు