నిజానికి గత శనివారం సోనియా, ప్రశాంత్ కిషోర్‌ల మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా మిషన్ 2024పై ఆయన విశ్లేషణాత్మకమైన ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని, గెలుపు కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. యూపీ, ఒడిశా, బీహార్‌లో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని తెలిపారు. మరోవైపు పీకే సూచనలపై ఈ నెలాఖరున కాంగ్రెస్ పార్టీ స్పందించే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, పీకేతో భేటీకి ముందు పార్టీ సీనియర్ నేతలైన చిదంబరం, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్ వంటి కీలక నేతలతో సోనియా సమావేశమయ్యారు. ఈ సమావేశం నాలుగు గంటలకు పైగా కొనసాగింది. ఈ సమావేశానికి రాహుల్ దూరంగా ఉన్నారు.