దీంతో ఆమె ఉంటున్న అధికారిక బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ఆగస్టు ఒకటో తేదీ తర్వాత కూడా బంగ్లాలో ఉంటే డ్యామేజీ ఛార్జీలు, రెంట్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర పట్టణ, గృహ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఈ చేసింది.
గతంలో ఎస్పీజీ ప్రొటెక్షన్‌లో ఉన్న ప్రియాంకకు 1997 ఫిబ్రవరి 21న లోధీ ఎస్టేట్ బంగ్లాను కేటాయించారు. గత నవంబరులో ప్రియాంకకు ఎస్పీజీ సెక్యూరిటీని తొలగించి, జెడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, కేంద్ర హోంశాఖ సిఫారసు ఉంటేనే జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న వారికి నివాస సదుపాయాన్ని కల్పిస్తారు.