చీపురు పట్టి గదిని శుభ్రం చేసిన ప్రియాంకా గాంధీ

సోమవారం, 4 అక్టోబరు 2021 (13:39 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ చీపురు పట్టారు. ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ల‌ఖింపుర్ ఖేరిలో కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతుల మీద నుంచి దూసుకెళ్లిన ఘ‌ట‌న‌లో పలువురు రైతులు మృత్యువాతపడ్డారు. 
 
ఈ ఘటనను నిర‌సిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంగా గాంధీ వ‌ద్రా ఆందోళ‌నకు దిగారు. రైతులను పరామర్శించేందుకు బయలుదేరిన ఆమెను సీతాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక గెస్ట్ హౌజ్‌లో ఆమెను నిర్బంధించారు. పీఏసీ గెస్ట్ హౌజ్‌లో ఉన్న ఆమె.. అక్క‌డ చీపురు అందుకుని ఆ రూమ్‌ను శుభ్రం చేశారు. ఆ త‌ర్వాత ఆమె నిరాహార దీక్షకు దిగారు. 
 
గెస్ట్ హౌజ్ రూమ్ శుభ్రంగా లేద‌ని, అందుకే ఆమె ఆ రూమ్‌ను క్లీన్ చేసిన‌ట్లు కొంద‌రు తెలిపారు. ప్రియాంకా త‌న‌ను బంధించిన గ‌దిని ఊడ్చిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆమె అరెస్టును నిర‌సిస్తూ ఆందోళ‌న‌కారులు ఆ గెస్ట్ హౌజ్ ముందు ధ‌ర్నా చేప‌ట్టారు. 
 
ప్రియాంకా గాంధీ, దీపేంద‌ర్ హూడాల‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును కాంగ్రెస్ ఖండించింది. సీతాపూర్‌లో త‌న కాన్వాయ్‌ను అడ్డుకున్న స‌మ‌యంలో ప్రియాంకా గాంధీ పోలీసుల‌పై తిర‌గ‌బ‌డ్డారు. త‌న అరెస్టు వారెంట్ చూపించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. కానీ పోలీసులు బలవంతంగా ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. 

 

Priyanka Gandhi has been put in dirty dusty room with no furniture, she picked broom and cleaned the room pic.twitter.com/h6P1likpOz

— Sceptic Indian (@Aaabshar) October 4, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు