దేశ వ్యాప్తంగా త్వరలోనే దసరా శవన్నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. అయితే, ఈ యేడాది కరోనా మహమ్మారి కారణంగా బెంగాల్ రాష్ట్రంలో దుర్గా పూజలకు అనుమతి లేదని, ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
ఈ విషయంలో సోషల్ మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని, ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిని గుర్తించి, వంద గుంజీలు తీయించండని పోలీసులను సీఎం ఆదేశించారు. ఇలాంటి తప్పుడు ప్రచారంతో మత సహనం దెబ్బతింటోందని ఆమె మండిపడ్డారు. కాళీ, దుర్గా, హనుమాన్ పూజలు చేయని వారు కూడా పూజ గురించి మాట్లాడేస్తున్నారని సీఎం మమత మండిపడ్డారు.