అదేసమయంలో రజనీ స్వంతంగా పార్టీని ఏర్పాటుచేయబోతున్నారని, ఆయన ఏ జాతీయ పార్టీలోగానీ, ప్రాంతీయపార్టీలోగానీ చేరబోరన్నారు. ఒక స్నేహితుడిగా రజనీ తనకు గత 35 నుండి 40 యేళ్లుగా తెలుసునన్నారు.
ఆయన ఏ జాతీయ పార్టీలోగానీ, ప్రాంతీయ పార్టీలోగానీ చేరతారని తాను అనుకోవడం లేదన్నారు. ఆయనే స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదన్నారు. రజనీ పార్టీ పెడితే ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది ఆయన ఇష్టమన్నారు. దానిపై తానేమీ చెప్పలేనన్నారు.