చెన్నై ఆర్.కె.నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అసమ్మతి నేత, శశికళ బంధువు టీటీవీ దినకరన్ గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి రెండు రౌండ్లలో దినకరన్ ఇతర పార్టీల అభ్యర్థుల కంటే 5 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు శరవేగంగా సాగుతోంది.
మరోవైపు... కౌంటింగ్ కేంద్రం వద్ద దినకరన్ వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు హడావుడి ఎక్కువకావడంతో పాటు.. సందడి చేస్తూ, బాణా సంచా కాలుస్తూ ఉండటంతో భారీ సంఖ్యలో పారామిలిటరీ బలగాలను మొహరించారు. అంతకుముందు దినకరన్, అన్నాడీఎంకే ఏజంట్ల మధ్య జరిగిన గొడవ కారణంగా కొద్దిసేపు కౌంటింగ్ కాసేపు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా కరు నాగరాజన్ పోటీ చేశారు. ఈయనకు నోటా గుర్తు కంటే అతి తక్కువ ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి నోటా గుర్తుకు 208 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్‌కు కేవలం 117 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.