ప్రేమికులు పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది అత్యాచారం కాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. గాఢంగా ప్రేమించుకుని పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే, ఆపై రేప్ కేసు పెడితే ఆ యువకుడిని నిందితుడిగా పరిగణించవద్దని బాంబే హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో.. తాజాగా గుజరాత్ హైకోర్టు భిన్నమైన తీర్పునిచ్చింది.
భార్య అనుమతి లేకుండా బలవంతంగా శృంగారం నెరపితే అది అత్యాచారమేనని గతంలో పలు కోర్టులు తీర్పునిచ్చాయి. కానీ గుజరాత్ హైకోర్టు మాత్రం.. భార్య అనుమతి లేకుండా చేసే శృంగారం వైవాహిక అత్యాచారం కాదని స్పష్టం చేసింది. కానీ ఓ వ్యక్తి జంతువుల మధ్య జరిగే లైంగిక చర్య, అసహజ మార్గంలో జరిగే లైంగిక చర్యలు వంటి విపరీత ప్రవర్తనలు చేస్తే అది క్రూరత్వంతో సమానం అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.