అయోధ్యలో వున్నది మసీదు కాదని.. అది రామ జన్మభూమి అని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుందని... బాబర్ సానుభూతిపరులంతా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో అసలు బాబ్రీ మసీదే లేదని స్పష్టం చేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్నంతవారంతా పాకిస్థాన్‌కు వెళ్ళిపోవాలన్నారు.
వసీం రిజ్వీ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఇటీవల రిజ్వీ కామెంట్స్ చేశారు. మదర్సా వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు లేఖలు కూడా రాసిన సంగతి తెలిసిందే.