కానీ కర్ణాటక చామరాజనగర్ ప్రజలు మాత్రం జాతీయ రహదారిపై ఉన్న రాయి దగ్గరకు వెళుతున్నారు. ఆ రాయికి మొక్కితే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయట. యలందూర్ నుంచి మాంపల్లి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై ఓ రాయి చాలా ఏళ్లుగా ఉంది.
మోకాళ్ల, నడుము, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయని విశ్వాసం. ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు, కూలీలు సైతం ఇక్కడకు దిగి మొక్కుతున్నారు. అక్కడ నారికల్లు మారమ్మ అనే దేవత ఉందని స్థానికులు నమ్ముతారు.