మూడు రోజుల పసికందును కరిచిన ఎలుకలు.. ఎక్కడ?

గురువారం, 5 మే 2022 (18:11 IST)
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాసుపత్రులు దారుణంగా తయారవుతున్నాయి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో ప్రభుత్వ ఆస్పత్రులు విఫలమవుతున్నాయనేందుకు ఈ ఘటనే నిదర్శనం. 
 
అసలే రోగాలతో ఆస్పత్రికి వస్తున్న పేషంట్లకు ఎలుకల భయం పట్టుకుంటుంది. మౌలిక వసతుల మాట పక్కనపెడితే.. ఎలుకల దాడికి పేషెంట్లు భయపడుతున్నారు. ఇటీవలే వరంగల్ ఎంజీఎంలో ఓ రోగిని ఎలుకలు తీవ్రంగా కరవడంతో.. అతను మృతి చెందాడు.
 
తాజాగా జార్ఖండ్‌లో అలాంటి ఘటన మరొకటి జరిగింది. గిరిధ్‌లోని సదర్ ఆసుపత్రిలో మూడు రోజుల పసికందును ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలుకలు కరిచిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ధన్ బాద్‌లోని షాహీద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చిన్నారి మోకాలుకు తీవ్రగాయమైందని, నిపుణులైన వైద్యుడితో శస్త్రచికిత్స చేయించామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు