రష్యా అభివృద్ధిచేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-వితో మనుషులపై రెండు/మూడో దశల ప్రయోగ పరీక్షలను ప్రారంభించినట్లు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ కో-చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.ప్రసాద్ వెల్లడించారు.
కేంద్ర బయోటెక్నాలజీ విభాగానికి చెందిన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్తోనూ జట్టు కట్టామని, తద్వారా వాటికి చెందిన క్లినికల్ ట్రయల్ కేంద్రాలను వాడుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు.