బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో వెనుకంజ... ఎందుకంటే?

మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (12:57 IST)
భారతీయ జనతా పార్టీతో పాటు.. దాని మిత్రపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో బాగా వెనుకబడివున్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్నాయన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తూర్పు రాష్ట్రాల్లోని సూచీల కారణంగానే దేశం అభివృద్ధిలో వెనుక బడుతోందన్నారు. ప్రత్యేకించి బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో నెలకొన్న సామాజిక పరిస్థితులు అభివృద్ధికి ప్రతిబంధకాలుగా మారాయన్నారు. 
 
'తూర్పు భారత ప్రాంతంలో ముఖ్యంగా బీహార్, యూపీ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు దేశాన్ని వెనక్కి లాగుతున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ సామాజిక సూచీలు బాగా వెనకబడ్డాయి...' అని నీతీ ఆయోగ్ సీఈవో  పేర్కొన్నారు. కాగా దేశం వెనుకబాటుకు కారణమైన రాష్ట్రాలన్నీ బీజేపీ, దాని మిత్రపక్షాలు పరిపాలిస్తున్నవే కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు