స్టాట్యూ ఆఫ్ యూనిటీ చాలా బాగుందని, ఇలాంటి నిర్మాణాలు ఇంజనీర్లకు సవాళ్లని, డిజైనింగ్, సరైన మెటీరియల్‌ను వాడటం లాంటి అంశాలు కీలకమని బ్రిటన్ సంస్థకు చెందిన మార్టిన్ పావెల్ చెప్పారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి ఆర్కిటెక్ట్ రామ్ సుతార్ డిజైన్ చేశారు.
ఎల్ అండ్ టీ సంస్థ దీన్ని నిర్మించింది. గతంలో స్ట్రక్చరల్ అవార్డుకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఒపెరా హౌస్, పారిస్ లోని పొంపిడౌ సెంటర్, ఇంగ్లండ్ లోని సెవెర్న్ బ్రిడ్జి ఎంపికయ్యాయి. 52 ఏళ్లుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీకి రెండింతలు ఎత్తైన ఈ విగ్రహ నిర్మాణానికి 70 వేల టన్నుల సిమెంటు, 18,500 టన్నుల ఇనుము, 1700 మెట్రిక్ టన్నుల కాంస్యం వాడారు.