దేశంలో జరుగుతున్న సహజీవనాలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆందోళన వ్యక్తంచేసింది. సహజీవనాలు మన దేశంలోని అత్యంత బలమైన, సంప్రదాయబద్ధమైన వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. వివాహాలు ఇచ్చే భద్రత, సమాజ అమోదం, స్థిరమైన బంధాన్ని సహజీవనాలు (లివిన్ రిలేషన్ షిప్స్) ఇవ్వలేవని తెలిపింది. ఒక్కో సీజన్‌కు ఒక్కో భాగస్వామిని మార్చే ఈ దరిద్రపు వ్యవస్థ ఆరోగ్యకరమైన సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పింది.
సహజీవనం అనేది అభివృద్ధి చెందిన సొసైటీలో భాగమని భావిస్తున్నారని హైకోర్టు విమర్శించింది. ఇలాంటి భావనకు యువత ఆకర్షితులవుతున్నారని, లివిన్ రిలేషన్ షిప్‌ల వల్ల జరిగే అనర్థాలపై వారికి అవగాహన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. లివిన్ రిలేషన్ షిప్‌ల వల్ల అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని... వివాహ వ్యవస్థను కాపాడుకోవడం వారికి పెద్ద సమస్యగా మారిందని తెలిపింది.