గత వారం పూణేలోని ఇన్ఫోసిస్లో పని చేస్తున్న లేడీ టెక్కీ రసిలా రాజు (24) ఆమె పని చేస్తున్న కార్యాలయంలోనే హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత డిసెంబర్ నెలలో పూణేలో తను పని చేస్తున్న కార్యాలయంలోనే మరో టెక్కీ ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా జీవితంపై విరక్తిని పెంచుకున్న ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పూణే నగరంలో చోటుచేసుకుంది.
ఇతను ప్రేమలో విఫలం కావడంతో నెల రోజుల పాటు స్నేహితులతో కలిసిమెలసి ఉండలేకపోయాడు. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించేవాడు ఈ క్రమంలో అభిషేక్.. తన స్నేహితులతో కలిసి వుంటున్న అపార్ట్మెంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిద్రొస్తుందని వెళ్లి బెడ్రూమ్లోకి వెళ్లిన అభిషేక్ చాలాసేపటికి తలుపులు తెరవకపోవడంతో కిటికీల నుంచి చూశామని.. అప్పటికే అభిషేక్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించాడని స్నేహితులు అన్నారు.