ఈ రోజుల్లో ప్రేమ వివాహాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. ఇంతవరకు ప్రేమికులు తమ కులాలు, మతాలు, అంతస్తులను తెంచుకుని వారు ప్రేమించిన వారిని పెళ్ళాడేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. మరికొందరైతే ఆశ్చర్యంగా వైఫ్‌తో సంబంధం లేకుండా కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఈ రకంగానే తమిళనాడులో జరిగిన ప్రేమ వివాహం వెలుగులోకి వచ్చింది.
తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి సమీపంలోని గాంధీనగర్‌లో 10వ తరగతి చదువుతున్న సెంథిల్ అనే అబ్బాయి తన క్లాస్ టీచర్ జ్యోతికతో ప్రేమ కార్యకలాపాలు నడిపాడు. అంతేకాకుండా తనకు పాఠాలు చెబుతున్న టీచర్‌తోనే శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ టీచర్ కూడా తాను పాఠాలు చెబుతున్న స్టూడెంట్‌కు ఆకర్షితురాలై అతడితో తన కోరికలను తీర్చుకుంది. దీంతో ఆమె గర్భవతి అయ్యింది. విషయం తెలిసిన పేరెంట్స్ మండిపడ్డారు.