ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

ఠాగూర్

శుక్రవారం, 22 నవంబరు 2024 (18:09 IST)
గతంలో ఓ చిత్రం షూటింగ్ సమయంలో ఓ హీరో తన పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారంటూ సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ వెల్లడించారు. గోవా వేదికగా ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఇందులో సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ, మహిళలకు అన్నిచోట్లా ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంటూ ఒకానొక సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. 
 
గతంలో ఓ సినిమా సెట్లో ఒక హీరో తనతో ఇబ్బందికరంగా మాట్లాడాడు. తనకు ఏదైనా ఛాన్స్ ఉందా అని అడిగారు. వెంటనే తాను నా చెప్పుల సైజు 41, ఇక్కడే చెంప పగలకొట్టనా లేదా సెట్లో అందరి ముందు పగలకొట్టనా అని అడిగినట్లు తెలిపారు. సినిమాలతో  ప్రేక్షకులను అలరించాలని తాను పరిశ్రమలోకి వచ్చానని.. సమానత్వం, గౌరవంలో ఎక్కడా రాజీ పడకూడదనేది తన సిద్ధాంతమని అలానే తాను పని చేసినట్లు ఖుష్బూ వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు