హృద్రోగులు వాయు కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉండే సమయాల్లో, సాధారణంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో ఆరుబయట అడుగు పెట్టకుండా ఉండాలి.
ఆరుబయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా N95 మాస్క్ ధరించాలి.
గుండె రోగులు యాప్‌లు లేదా వెబ్‌సైట్‌ల ద్వారా గాలి నాణ్యత సూచికలను (AQI) క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
హృద్రోగులు వారికి సూచించిన మందులను తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం.
పుష్కలంగా నీరు త్రాగడం వల్ల శరీరం నుంచి వ్యర్థాలు బయటకెళ్తాయి. ఫలితంగా హృదయనాళ వ్యవస్థపై మొత్తం భారాన్ని తగ్గిస్తుంది.
గుండెకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి.
గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. పూర్తి సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.