పెట్రో ధరల పెరుగుదల మళ్లీ మొదలైంది. లీటరు పెట్రోల్ ధరను 26పైసలు, డీజిల్ ధరను 25 పైసలు పెంచాయి ప్రభుత్వ రంగంలోని చమురు విక్రయ కంపెనీలు. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.83.71 నుంచి రూ.83.97కు, డీజిల్ ధర రూ.73.87 నుంచి రూ.74.12కు చేరుకుంది.
ఇంతకు ముందు పెట్రో ధరలు గరిష్ఠ స్థాయిని తాకిన ప్పుడు ప్రభుత్వం లీటరు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.1.50 తగ్గించింది. చమురు కంపెనీలు లీటరుపై మరో రూ.1 తగ్గించాయి. దీని వల్ల వాహనదారులపై భారం కాస్త తగ్గే అవకాశం ఏర్పడింది.