మరోవైపు దేశంలో వ్యాక్సిన్‌పై అనుమానాలతో చాలా ప్రాంతాల్లో టీకా వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని, దీనిపై శాస్త్రీయ విధానం ద్వారా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ మేరకు కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కమ్యూనికేషన్ స్ట్రాటజీని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకుంది.
కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన గిరిజన ప్రాంతాల్లోనూ వ్యాక్సిన్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. దేశ వ్యాప్తంగా తాజాగా జరిగిన రెండు ఘటనలే ఇందుకు నిదర్శనం. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ వృద్ధురాలు వ్యాక్సిన్ వేయించుకోకుండా ఓ నీళ్ల డ్రమ్ము వెనుక ఉండిపోయింది.