'బీరు తాగండి...హెయిర్ కట్ చేసుకోండి..వ్యాక్సిన్ తీసుకోండి' అంటూ అక్కడి ప్రజలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మేలుకొల్పుతున్నారు. వచ్చే నెల 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం నాటికి అమెరికాలోని వయో జనాభాలో 70 శాతం మంది టీకాలు తీసుకునేందుకు చేపడుతున్న భారీ ప్రయత్నాల్లో భాగంగా బైడెన్ ఈ పిలుపునిచ్చారు.
'వ్యాక్సిన్ తీసుకోండి..బీర్ తాగండి' అంటూ తన స్వాతంత్య్ర దినోత్సవ లక్ష్యాన్ని చేరుకునే ప్రచారానికి తెర తీశారు. అందుకు తగ్గట్లు అన్హ్యూజర్-బుష్ కంపెనీలకు సంబంధించిన బీర్లను అందుబాటులో ఉంచడం నుండి బార్బర్ షాపుల వరకు తగిన ఏర్పాటు చేశారు. తాము అమెరికా ప్రజల సాయాన్ని కోరుతున్నాం అంటూ వ్యాఖ్యానించారు.
కోవిడ్ -19 ప్రతి ఒక్కరినీ ఇబ్బందులకు గురి చేస్తోందని, కోవిడ్ నుండి స్వాతంత్య్రాన్ని పొంది, మరో సంవత్సరం ఆరోగ్యంగా జీవించేందుకు మనల్ని..మనం రక్షించుకుందాం అంటూ సందేశం ఇచ్చారు. వ్యాక్సినేషన్‌లో 70 శాతం లక్ష్యాన్ని సాధిస్తామన్నా ధీమా వ్యక్తం చేశారు.