తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణానికి చెందిన అర్చన.. గత కొంతకాలంగా వీడియోలో చేస్తూ వాటిని టిక్‌టాక్‌లో పోస్ట్ చేస్తూ వస్తోంది. ఈమె వీడియోలకు మంచి స్పందన ఉంది. ఈ క్రమంలో అర్చనకు టిక్‌టాక్‌లో బెంగళూరుకు చెందిన అంజలి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది.
బెంగళూరుకు చెందిన అంజలి పురుషుడి వేషంలో టిక్‌టాక్‌లు చేస్తుండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్యా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే, అర్చనకు అప్పటికే వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టిక్‌టాక్ మానియాలో యువత ఊగిపోతోంది. టిక్‌టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పెద్దలు సైతం టిక్‌టాక్‌లు చేస్తూ ఊహా లోకాల్లో తేలిపోతున్నారు.