ఆవును కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. దీంతో ఆవును కొనుగోలు చేయడానికి సైబర్ నేరగాడు.. సాహుతో రూ. 20వేలకు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మనీ ట్రాన్స్‌ఫర్ అవుతాయని చెప్పి సైబర్ నేరగాడు సాహుకు ఓ క్యూఆర్ కోడ్ పంపాడు. అయితే అది స్కాన్ చేయగా సాహు అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యాయి. ఇలా ఐదు సార్లు క్యూఆర్ కోడ్ పంపిన సైబర్ నేరగాడు.. సాహు వద్ద నుంచి లక్ష రూపాయలు దోచేశాడు.
"మొదట అతడు నాకు క్యూఆర్ కోడ్ పంపాడు.. అది స్కాన్ కోడ్‌ను పంపాడు. నేను దానిని నా ఫోన్‌లో స్కాన్ చేయగానే.. నా బ్యాంక్ ఖాతాలో 5 రూపాయలు జమ అయ్యాయి. తనపై నమ్మకం కలిగేలా చేసి మరో క్యూఆర్ కోడ్‌ను పంపాడు. అప్పుడు నా అకౌంట్‌లో నుంచి రూ. 20వేలు డెబిట్ అయ్యాయి. దీని గురించి అతడిని ప్రశ్నించగా.. సాంకేతిక లోపం కారణంగా అలా జరిగిందని చెప్పాడు.
ఆ డబ్బులు తిరిగి పొందాలంటే మరో కోడ్‌ను స్కాన్ చేయమని చెప్పాడు.. ఇలా చేయడం ద్వారా రూ. లక్ష కోల్పోయాను" అని సాహు చెప్పాడు. ఇక, ఈ ఘటన అనంతరం తనలాగా ఆన్‌లైన్ మోసాలకు బలికావద్దని ఆయన ప్రజలకు కోరుతూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇక, కష్టపడి సంపాదించిన డబ్బును సైబర్ నేరగాళ్ల దోచుకోవడంతో సాహు సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.