వివరాల్లోకి వెళితే.. జై హింద్ అనే వ్యక్తికి తీజా అనే యువతికి వివాహం నిశ్చయించారు. సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి పెళ్లికూతురు ల్యుకోడర్మా అనే చర్మ వ్యాధితో బాధపడుతుందని, ఈ విషయాన్ని దాచారని వదంతులొచ్చాయ్. దీనిపై వరుడి కుటుంబ సభ్యులు రచ్చ చేశారు. దాదాపు పెళ్లిని ఆపేంత పనిచేశారు. అయితే, పెళ్లి కూతురు తండ్రి పోలీసులను పిలవడంతో నేరుగా ఇరు వర్గాలను స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు అక్కడే ఓ స్టేషన్ గదిలోకి అబ్బాయి తరుపు మహిళలు కొందరిని పంపించి అక్కడే పెళ్లి కూతురు వస్త్రాలు తీయించి తనిఖీలు చేయించారు.