తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీరట్ జిల్లాలోని హపూర్‌కు చెందిన నిందితుడికి ఆరేండ్ల కిందట మీరట్‌లోని లిసారి గేట్ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. కొన్నేండ్ల కిందట ఇరువురి మధ్య విభేదాలు రావడంతో కొంతకాలంగా నిందితుడి భార్య పుట్టింట్లోనే ఉంటోంది. రెండు నెలల కిందట మహిళ చెల్లెలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇక నిందితుడి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. తాను పనిమీద బయటకు వచ్చిన సమయంలో తన బావ మాయమాటలు చెప్పి తనను తీసుకువెళ్లాడని, మత్తుమందు కలిపిన ఇంజక్షన్లు ఇచ్చి రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడని వివరించింది. బాలికని వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.