తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానికంగా ఓ కిరాణాషాపు యజమాని ఎండ తగులకుండా తన షాపు ముందు రేకుల కప్పు ఏర్పాటుచేసుకున్నాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షం కారణంగా కరెంటు తీగ కొంచెం జారి రేకులకు అనుకుంది.
పక్కనే ఉన్న మరో ముగ్గురు వారిని కాపాడేందుకు ప్రయత్నించగా వారు కూడా విద్యుత్ షాక్‌తో స్పృహ కోల్పోయారు. వెంటనే ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. మృతులు జానకి (35), ఆమె కూతురు సుభి (3), లక్ష్మీశంకర్ (24), ఖుషి (10), సిమ్రాన్ (11)గా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.