ఔట్‌సోర్సింగ్‌లో రిజర్వేషన్లు వర్తిస్తాయా? ఓబీసీలకు 54 శాతానికి పెంచండి : ఎస్పీ

బుధవారం, 9 జనవరి 2019 (17:15 IST)
దేశంలో ఉన్న వెనుకబడిన తరగతుల ప్రజలకు 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశంలో 98 శాతం పేదలకు కేవలం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని 54 శాతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుపై బుధవారం రాజ్యసభలో పూర్తిస్థాయి చర్చ జరిగింది. ఇందులో రాంగోపాల్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 98 శాతం ఉన్న ప్రజలకు కేవలం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అందువల్ల జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాల ప్రజలకు 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అలాగే, ఇపుడు ఉద్యోగాలన్నీ ఔట్‌సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారనీ, ఈ రిజర్వేషన్ల వర్తింపు ఔట్‌సోర్సింగ్‌కు కూడా వర్తిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పరీక్షల్లో జనరల్ కేటగిరీలో దళితులు కటాఫ్ మార్కుల కన్నా ఎక్కువ సాధించినా వారిని రిజర్వేషన్ కోటాలోనే ఎందుకు ఎంపిక చేస్తున్నారంటూ ఆయన సర్కారును నిలదీశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు