ఇటీవల భాజపాలో చేరిన ప్రముఖ అందాల నటి జయప్రద కన్నీరు పెట్టుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని రామ్‌పూర్ నియోజవర్గం నుండి పోటీ చేస్తున్న జయప్రద... ఈ సందర్భంగా రామ్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని... ఓట్లు వేయమని కోరడంతోపాటు కన్నీళ్లు పెట్టుకుంటూనే ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు కూడా గుప్పించేసారు.