పాకిస్థాన్‌లో మోసపోయిన భారత యువతి ఉజ్మా.. ఎన్నో పోరాటాలకు అనంతరం గురువారం భారత్‌లో అడుగుపెట్టింది. పాకిస్థాన్ అధికారులు, భారత్ హై కమిషన్‌కు చెంది అధికారులు ఆమెకు తోడుగా వచ్చారు. వాఘా సరిహద్దు దాటి ఉజ్మా భారత్‌లోకి ప్రవేశించింది.
మే నెల ప్రారంభంలో ఇస్లామాబాద్ వెళ్లిన ఉజ్మాను తాహిర్ అనే వ్యక్తి తుపాకీతో బెదిరించి వివాహం చేసుకున్నాడు. ఆపై ట్రావెలింగ్ పేపర్లు తీసుకెళ్లి అక్కడే ఉండిపోయేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. వీరిద్దరికి అంతకుముందే మలేషియాలో పరిచయం ఉండటంతో తాహిర్ బలవంతంగా ఉజ్మాను లొంగదీసుకుని పెళ్లి చేసుకున్నాడు.
ఈ గడ్డుపరిస్థితి నుంచి తనకు విముక్తి లభించేందుకు సహకరించిన ఇండో-పాక్ అధికారులకు, కోర్టు, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. ఉజ్మాకు జరిగిన అన్యాయానికి సారీ చెప్పారు. ఆపై ఉజ్మాను ఆమె బంధువులకు అప్పగించారు.