అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగేశ్వర రావు గారి విగ్రహం ముందు పెళ్లి చేసుకున్నారు. ఆయన ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇరు కుటుంబాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాగచైతన్య అంతకుముందే చెప్పారు. శోభిత తనను బాగా అర్థ చేసుకుందని, ఆమెతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని వివరించారు.