అతనిలో కోపం..ఆవేశం..తగ్గలేదు. ఒళ్ళంతా నెత్తుటి మరకలు. పోలీసులు అతన్ని చూసి ఏం జరిగిందని అడుగుతున్నారు. భార్యను చంపి నేరుగా మీ దగ్గరకే వస్తున్నానన్నాడు ఆవేశంగా. ఎందుకు చంపావని రాత్రి వేళ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ళు అడుగుతున్నారు. అతని ఆవేశం మరింత రెట్టింపయ్యింది. అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు.