పార్టీ పేరుతో ఏ ఒక్క స్కీమ్ ఉండకూడదు.. ఆ పథకాల పేర్లు మార్చండి : సీఎం యోగి ఆదేశం

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (16:29 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ పాలనతో సమాజ్‌వాదీ పేరుతో ప్రారంభించిన అన్ని ప్రభుత్వ పథకాల పేర్లను మార్చు చేయాల్సిందిగా ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వ పథకాల పేర్ల ముందు సమాజ్‌వాదీ అనే పేరు కనిపించడానికి వీల్లేదని ఆయన ఆదేశించారు. పైగా, అలాంటి పథకాలకు ముఖ్యమంత్రి అని పేరు పెట్టాలని సూచించారు. 
 
లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ "సమాజ్ వాదీ అన్న పేరుతో కొనసాగుతున్న పథకాలన్నిటినీ కేబినెట్ ముందు ప్రవేశపెట్టాలి. ఆ పథకాలన్నిటికీ ‘ముఖ్యమంత్రి’ పథకాలుగా నామకరణం చేస్తాం" అని అన్నారు. 
 
ఇంతకుముందు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం.. ప్రభుత్వ పథకాల ముందు సమాజ్‌వాదీ పేరును జోడించింది. ఎన్ఆర్‌హెచ్ఎమ్ కింద నడిచే అంబులెన్సులకు సైతం సమాజ్‌వాదీ అంబులెన్స్ సర్వీస్ అని పేరుపెట్టింది. వీటన్నింటినీ రద్దు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి