బహుమతి కిట్‌లో కండోమ్‌లు, ఇతర గర్భనిరోధక సాధనాలు ఉన్నాయి. ఈ కిట్లకు 'నయీ పహల్' అనే పేరు పెట్టారు. ఈ నెల 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆశా వర్కర్లు ఈ కిట్లను అందజేస్తారు.
ఈ కిట్లలో సురక్షిత శృంగారం, ప్రసవాల మధ్య సమయం, కుటుంబ నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని అందించే బ్రోచర్లు కూడా ఉంటాయి. దీంతో పాటు కర్చీఫ్‌లు, తువ్వాళ్లు, దువ్వెన, అద్దం, నెయిల్ కట్టర్‌ను కూడా అందిస్తారు.