ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనక దుర్గమ్మ బుధవారం సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తోంది.
వీణావాదము చేస్తూ, పుస్తకం ధరించిన అమ్మవారిని దర్శిస్తే సకల జ్ఞాన సంపదలు కలుగుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. జగజ్జనని జన్మనక్షత్రమైన మూల నక్షత్రంలో సరస్వతీ రూపిణి అయిన అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రి చేరుకుంటారు.
మంగళవారం రాత్రి 2గంటల నుంచే చదువుల తల్లిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతినిచ్చారు. ఇంకా దసర నవరాత్రుల సందర్భంగా బుధవారం ఇంద్రకీలాద్రి భక్తులతో పోటెత్తింది.
అమ్మవారి దర్శనం కోసం భక్తులు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అధికారులు ఉచిత దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.