27-05-2025 దినఫలాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

రామన్

మంగళవారం, 27 మే 2025 (04:27 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆటుపోట్లను అధిగమిస్తారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయంలోనూ రాజీపడొద్దు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పనులు మధ్యలో ఆపివేయొద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఆశావహదృక్పధంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అందరితోను మితంగా సంభాషించండి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. కీలక చర్చల్లో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధృఢసంకలంతో అడుగు ముందుకేయండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. నిస్తేజానికి లోనవుతారు. సన్నిహితులతో సంభాషిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా శ్రమిస్తారు. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. చేస్తున్న పనులు మధ్యలో నిలిపివేయొద్దు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయం తెలుసుకోండి. వివాదాలు పరిష్కారమవుతాయి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. లావాదేవీలు కొలిక్కివస్తాయి. విజ్ఞతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
రుణ విముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. అతిగా శ్రమించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారానుకూలత ఉంది. ఓర్పుతో యత్నాలు సాగించండి. రావలసిన ధనం అందుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. అవకాశం కలిసివస్తుంది. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రణాళికాబద్ధంగా శ్రమించండి. అనాలోచిత నిర్ణయం తగదు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఖర్చులు విపరీతం. పొదుపునకు అవకాశం లేదు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్ధతను చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త పనులు మొదలెడతారు. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు