అమృతకాలము - 11:00 PM – 12:35 AM
బ్రహ్మ ముహూర్తం - 04:36 AM – 05:24 AM
సరస్వతీ పూజా సందర్భంగా అమ్మవారికి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి దీపారాధన చేయాలి. అలాగే అమ్మవారికి క్షీరాన్నం, పాలతో బెల్లం నెయ్యి వంటి పదార్థాలు కలిపి చేసిన వాటిని నివేదించాలి. అలాగే చలివిడి వడపప్పు పానకం వంటివి ప్రత్యేక నైవేద్యాలు, నానబెట్టి మొలకలు ఎత్తించిన పెసర్లు, శనగలు వంటి పదార్థాలు సమర్పిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు.
సరస్వతీ పూజా సమయంలో శ్రీ సరస్వతీ కవచంతో పాటు నవరాత్రుల వేళ అమ్మవారికి అష్టోత్తర నామాలు, సహస్ర నామాలు చదువుతూ పూజించాలి. అలాగే దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయాలి. సరస్వతీ పూజ చేసే సమయంలో పెద్దవారు మాత్రమే ఉపవాసం ఉండాలి, అంటే 15 సంవత్సరాలలోపు పిల్లలు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. సరస్వతీ పూజకి తెల్లపూలు వాడాలి.
చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. వీలైతే తెల్లవస్త్రాలు, లేదా పట్టుబట్టలు ధరించాలి. అమ్మవారిముందు తాము చదువుకునే పుస్తకాలుపెన్నులు, 2ఉంచి, అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలు కూడా పూజించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.