సాధారణ బడ్జెట్: బంగారం-వెండిలు మరింత ప్రియం

శుక్రవారం, 26 ఫిబ్రవరి 2010 (13:50 IST)
విత్తమంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన 2010-11 సంవత్సర సాధారణ బడ్జెట్ పుణ్యమాని బంగారం, వెండి ధరలు మరింత ప్రియం కానున్నాయి. బంగారం నిల్వలో భారత్ పదో స్థానంలో ఉందని ఆర్థిక సర్వే వెల్లడించిన మరుసటి రోజే ఈ ధరలకు రెక్కలు రావడం గమనార్హం. బంగారం, వెండిపై ఎక్సైజ్ సుంకాలను పెంచుతున్నట్టు ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.

ఫలితంగా వీటి ధరలు అమాంతం పెరగనున్నాయి. అంతేకాకుండా, ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై విధించే సుకాన్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో దేశీయంగా సెల్‌ఫోన్ ధరలు మరింత చౌక ధరక అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు.. మైక్రోవేవ్‌లు, ఆటవస్తువుల ధరలు కూడా బాగాగ తగ్గనున్నాయి.

వెబ్దునియా పై చదవండి