గత కొంత కాలంగా పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ధరలు దిగి వస్తాయన్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆశలు నిరాశలవుతున్నాయి. దీంతో వారు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టిపెడుతుండటంతో రానున్నకాలంలో పసిడి మార్కెట్ పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్ వర్గాలు తమ మార్కెట్‌ను కాపాడుకునే విషయమై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పొరుగు దేశమైన చైనా, బంగారం కొనుగోళ్లలో భారత్‌ను అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరొవైపు దేశీయ పసిడి ఉత్పత్తులు కూడా భారీగా తగ్గడంతో విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల ఏడవ తేదీన పది గ్రాముల పసిడి ధర అత్యధికంగా రూ. 20,924లు పలికింది.