650 మంది ఉద్యోగులపై వేటు వేయనున్న బీబీసీ న్యూస్

ప్రపంచంలో ప్రముఖ న్యూస్ ఛానల్ బీబీసీ వరల్డ్ తన ఉద్యోగుల్లో 650 మందిపై వేటు వేయనుంది. తద్వారా 46 మిలియన్ పౌండ్ల నిధులను పొదుపు చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా బీబీసీకి చెందిన ఐదు సర్వీసులకు బ్రేక్ పడనున్నాయి.

ఇందులోభాగంగా అల్బేనియన్‌, మెసడోనియా, సెర్బియా, పోర్చుగీస్‌, కరేబియన్‌ ప్రాంతాల్లో సేవలు ఇకపై ఉండవని బీబీసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై బీబీసీ గ్లోబల్‌ న్యూస్‌ డైరెక్టర్‌ పీటర్‌ హరోక్స్‌ మాట్లాడుతూ బీబీసీ వరల్డ్‌కు లభించే విదేశీ సహాయక నిధులలో కోత కారణంగా ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందన్నారు.

వెబ్దునియా పై చదవండి